Census 1 నుంచి జనగణన
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:15 PM
Census from the 1st జిల్లాలో మే ఒకతో తేదీ నుంచి ‘జనగణన’ ప్రారంభం కానుందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 మండలాలు, రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
పార్వతీపురం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మే ఒకతో తేదీ నుంచి ‘జనగణన’ ప్రారంభం కానుందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 మండలాలు, రెండు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మే30 వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరిస్తారని చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం 1,744 మంది ఎన్యూమరేటర్లు, 302 మంది సూపర్‌వైజర్లను నియమించినట్లు చెప్పారు. ఈ నెలాఖరులోగా జిల్లావాసులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవ చ్చని తెలి పారు. స్వీయగణనకు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ప్రక్రియలో హెచ్ అక్షరంతో కేటాయించిన 11 అంకెల గుర్తింపు నెంబర్‌ను గృహ గణన సిబ్బందికి తెలియజేయాలని కలెక్టర్ వివరించారు.
29న అర్జీదారులతో ముఖాముఖి
రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో అసంతృప్తితో ఉన్న అర్జీదారులతో ఈ నెల 29న ముఖాముఖి నిర్వహిస్తున్నటు కలెక్టర్ తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని రెవెన్యూ క్లినిక్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటారని వెల్లడించారు. గతంలో సమర్పించిన గ్రీవెన్స్ రశీదు, దానిపై తహసీల్దార్, సబ్ కలెక్టర్ జారీ చేసిన ఎండార్స్‌మెంట్ కాపీని అర్జీదారులు తప్పక తీసుకురావాలన్నారు.