పైడిమాంబను దర్శించుకున్న ప్రముఖులు
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:05 AM
రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం విజయనగరంలోని పైడిమాంబ ఆలయాన్ని సందర్శించుకున్నారు.
విజయనగరం కల్చరల్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం విజయనగరంలోని పైడిమాంబ ఆలయాన్ని సందర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కె.శిరీష ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రికి స్వాగతం పలికారు. ఇదే సమయంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన కూడా పైడిమాంబను దర్శించుకున్నారు.