Share News

ప్రశాంతంగా పండుగను జరుపుకోండి

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:23 AM

కొత్తపోలమ్మ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే విజయచంద్ర ఆకాంక్షించారు.

 ప్రశాంతంగా పండుగను జరుపుకోండి
ఉత్సవ లోగోను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం టౌన్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్ర జ్యోతి): కొత్తపోలమ్మ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే విజయచంద్ర ఆకాంక్షించారు. ఇందుకు కమిటీ సభ్యులు ప్రణాళి కలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. బుధ వారం పట్టణంలోని కొత్తవలస కొత్తపోలమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు కొత్తపోలమ్మ పం డుగ జరగనున్న నేపథ్యంలో అమ్మవారి దర్శన అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడారు. కొత్తవలసలోని నందమూరి కాలనీలో అమ్మవారి ఘటాల ఊరేగించాలని, ఆ కాలనీ ప్రజలు కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారని పెద్దవీధి ప్రజలు ఎమ్మెల్యేకు తెలిపారు. వెంటనే ఉత్సవ కమిటీ, పెద్దవీధి, నందమూరి కాలనీల ప్రజలను పిలిపించి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకో వాలన్నారు. వివాదాలు, గొడవలకు అవ కాశం ఇవ్వరాదన్నారు. అమ్మవారి ఘటా లు కాలనీకి తీసుకువచ్చేలా ఒప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. పండుగలో అవాం ఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సీఐ వెంకటరావుకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం కొత్తపోలమ్మ గ్రామదేవత పండుగకు సంబంధించి లోగోను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

Updated Date - Apr 23 , 2026 | 12:23 AM