దీపావళి వేడుకలను సురక్షితంగా చేసుకోండి
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:06 AM
దీపావళి పండుగను ఎటువంటి ప్రమా దాలు జరగకుండా, ప్రతిఒక్కరూ సురక్షితంగా జరుపుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి జిల్లా ప్రజలకు సూచించారు.
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
అగ్నిప్రమాదాల నివారణపై షార్ట్‌ఫిలిం ఆవిష్కరణ
విజయనగరం, కలెక్టరేట్ నవంబరు 7(ఆంధ్ర జ్యోతి): దీపావళి పండుగను ఎటువంటి ప్రమా దాలు జరగకుండా, ప్రతిఒక్కరూ సురక్షితంగా జరుపుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి జిల్లా ప్రజలకు సూచించారు. ఈ ఉద్దేశంతో అగ్నిమా పక శాఖ రూపొందించిన అవగాహన షార్ట్‌ఫి లింను శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పీవీ రమణ ఆదేశాల మేరకు రూపొందించిన ఈ షార్ట్‌ఫిలిం ద్వారా బాణసం చా కాల్చే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్త లు, అగ్నిప్రమాదాల నివారణ చర్యలు, ప్రమా దాలు సంభవించినప్పుడు చేపట్టాల్సిన తక్షణ చ ర్యలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
భద్రతకు ప్రాధాన్యం ఇవ్వండి..
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరిపే క్రమంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బాణసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచాలని, బహిరంగ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చలని, నీరు, ఇసుక, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వంటి వాటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిషేధిత, నాణ్యత లేని బాణసంచాను వినియోగించరాదన్నారు. నిర్లక్ష్యం కారణంగా అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్, జిల్లా సహాయ అగ్నిమాపక సహాయ అధికారి సోమేశ్వరరావు పాల్గొన్నారు.