ద్విచక్ర వాహనం ఢీకొని పశువుల కాపరి మృతి
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:02 AM
ద్విచక్ర వాహనం ఢీకొని పశువుల కాపరి మృతిచెందిన ఘటన గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లి గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
గంట్యాడ, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనం ఢీకొని పశువుల కాపరి మృతిచెందిన ఘటన గంట్యాడ మండలంలోని కొండతామరాపల్లి గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గంట్యాడ పోలీసులు అందిం చిన వివరాలు ఇలా ఉన్నాయి కొండతామరాపల్లి గ్రామానికి చెంది న నాగిరెడ్డి వెంకటరావు(56) సోమవారం తన పశువులను మేత కు తీసుకువెళ్లి, తిరిగి కల్లానికి తీసుకువస్తున్నాడు. అదే సమయం లో ఎస్.కోట మండలం కిల్తపాలెం గ్రామానికి చెందిన పూర్ణచంద్రరావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై తన గ్రామం నుంచి విజయనగరం వైపు వెళ్తూ.. కొండతామ రాపల్లి వద్ద పశువులను ఢీకొట్టాడు. వెంటనే ద్విచక్రవాహనం వెంకటరావు మీద కు దూసుకువెళ్లింది. దీంతో వెంకటరావు కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే వెంకటరావును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలి స్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. పూర్ణచంద్రరావుకు కూడా ఈ ప్రమా దంలో గాయాలయ్యాయి. చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనదారుడి అతివేగంగా వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. అందిన ఫిర్యాదు మేరకు గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.