Cashew Prices ధరలు పేలుతున్నాయ్!
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:48 PM
Cashew Prices Are Soaring! దీపావళి అంటేనే దీపాల వెలుగులు... బాణసంచా మోతలు. ఈ పండగను చిన్నారులు నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఏడాది బాణసంచా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శాశ్వత లైసెన్స్‌లు కలిగిన దుకాణాల్లో టపాసుల ధరలు ఆకాశన్నంటుతుండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు.
బెంబేలెత్తిపోతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు
బెలగాం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): దీపావళి అంటేనే దీపాల వెలుగులు... బాణసంచా మోతలు. ఈ పండగను చిన్నారులు నుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఏడాది బాణసంచా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శాశ్వత లైసెన్స్‌లు కలిగిన దుకాణాల్లో టపాసుల ధరలు ఆకాశన్నంటుతుండడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే పండుగ కావడం, పిల్లలు అడుగుతుండడంతో ధరలు అధికంగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో జిల్లావాసులు టపాసులు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పార్వతీపురం, కురుపాం, పాలకొండ, ప్రాంతాల్లో అధికారికంగా లైసెన్స్‌లు పొందిన దుకాణాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది 22కు పైగా దుకాణాలకు తాత్కాలిక అనుమతులు ఇచ్చినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా లైసెన్స్‌లు పొందిన దుకాణాలకే కాకుండా పట్టణాలు, మండలాలకు సైతం బాణాసంచా సామగ్రీ చేరుతున్నట్టు సమాచారం. కొందరు వ్యాపారులు కొన్ని కంపెనీల నుంచి ఆర్డర్లపై బాణాసంచా తెప్పించి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేని ప్రాంతాల్లో విక్రయాలు జరిగితే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. కాగా షాపులకు అనుమతుల జారీలో పారదర్శకత పాటించాలని, అదనపు వసూళ్ల ఆరోపణలపై విచారణ జరపాలని, బాణాసంచా ధరలు, అనధికారిక విక్రయాలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
వాట్సాప్‌లోనే ఫైర్ అనుమతులు...
అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పొందేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్ని అవసరం లేకుండా వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దుకాణదారుడి పేరు, షాపు ఏర్పాటు చేసే ప్రదేశం చిరునామా, ఫోన్ నెంబర్, అగ్నిమాపక కేంద్రం వివరాలను 9441236448 నెంబర్‌కు వాట్సాప్ చేయాలి. అనంతరం రూ.500 చలానా చెల్లించి అనుమతి పొందే అవకాశం ఉంది. బాణసంచా దుకాణాల వద్ద అగ్నిమాపక వాహనం, నీటితో నిండిన డ్రమ్ములు, ఇసుక బకెట్లు, మంటలను అదుపు చేసే అగ్నిమాపక సిలిండర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
అనధికారికంగా విక్రయిస్తే చర్యలు తప్పవు
‘అనధికారికంగా బాణసంచా నిల్వ చేసినా.. విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తప్పవు. అనుమతులు ఉన్న వారు నిబంధనల మేరకు వ్యాపారాలు చేయాలి. జిల్లాలో రోజూ ఆకస్మిక తనిఖీలు చేపడతాం. ’ అని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.