Share News

అక్రమ విద్యుత్‌ పేరుతో కేసులు

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:26 AM

మండలంలోని రైతులు వ్యవసా య బోర్ల కనెక్షన్‌ కోసం ఫీజిబులిటీ చెల్లించి, కావాల్సిన ధ్రువపత్రాలను సం బంధిత కార్యాలయాలకు సమర్పించారు.

అక్రమ విద్యుత్‌ పేరుతో కేసులు

మెరకముడిదాం, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని రైతులు వ్యవసా య బోర్ల కనెక్షన్‌ కోసం ఫీజిబులిటీ చెల్లించి, కావాల్సిన ధ్రువపత్రాలను సం బంధిత కార్యాలయాలకు సమర్పించారు. వీరికి అనుమతి పత్రాలు రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సంబంధిత రైతులు అక్రమంగా విద్యుత్‌ వినియోగిస్తు న్నారన్న సమాచారంతో విజిలెన్స్‌ బృందాలు సోమవారం మెరకముడిదాం మం డలంలో దాడులు చేశాయి. మండలంలో 32 మంది రైతులు అక్రమంగా విద్యు త్‌ వినియోగిస్తున్నట్టు గుర్తించి, విజిలెన్స్‌ దాడులు జరిపి, కేసులు నమోదు చేశారు. పండగ వేళ.. గ్రామాల్లో విజిలెన్స్‌ దాడులు జరగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. కనెక్షన్‌కు డబ్బులు కట్టినా కేసులు నమోదు చేయ డంపై రైతులు గగ్గోలు పెడుతున్నారు. డబ్బులు చెల్లించిన వారికి నెలలు గడు స్తున్నా లైన్‌ కనెక్షన్‌ ఇవ్వకపోగా.. ఇలా విజిలెన్స్‌ దాడులు చేయడం దారుణ మని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 13 , 2026 | 12:26 AM