Share News

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:15 AM

తమ్ముడు అదృశ్యంపై అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ జోగారావు తెలిపారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

కొత్తవలస, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): తమ్ముడు అదృశ్యంపై అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ జోగారావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వీరభద్రపురం పంచాయతీ ములగపాకవానిపాలెం గ్రామానికి చెందిన గనివాడ అప్పలరాజు(40) మానసిక పరిస్థితి చిన్నప్పటి నంచి బాగోలేదు. దీంతో ప్రతిరోజూ మందులు వేసుకుంటాడు. రోజూ ఉదయాన్నే తమ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తూ అందరినీ డబ్బులు అడగడం, ఎవరైనా ఏమైనా పెడితే తినడం తిరిగి సాయంత్రం ఇంటికి రావడం చేస్తుంటాడు. ఈనెల 17వ తేదీ ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన అప్పలరాజు రాత్రయినా తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో అతని అన్న వెంకునాయుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Sep 27 , 2026 | 12:16 AM