బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:18 AM
ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు సీఐ టీవీ విజయ్‌కుమార్ సోమవారం తెలిపారు.
కొత్తవలస, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు సీఐ టీవీ విజయ్‌కుమార్ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ప్రతిరోజు కొత్తవలసలోని కళాశాలకు బస్సులో వెళ్లే సమయంలో ఇద్దరు యువకులు ఆమెను వెంబడించేవారు. ఆదివారం రాత్రి వారిద్దరూ నేరుగా ఇంట్లో చొరబడి బాలిక చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. దీంతో బాలిక తల్లి, మరికొంతమంది రావడంతో వారిద్ద రూ పరారయ్యారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.