Share News

చెరువులోకి దూసుకెళ్లి మునిగిన కారు

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:03 AM

కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో కారులో ఉన్న యజమాని ఊపిరాడక మృతిచెందిన ఘటన మండలంలోని గంట్యాడ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది.

చెరువులోకి దూసుకెళ్లి మునిగిన కారు

  • ఊపిరాడక యజమాని మృతి

గంట్యాడ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో కారులో ఉన్న యజమాని ఊపిరాడక మృతిచెందిన ఘటన మండలంలోని గంట్యాడ గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చినమానాపురం గ్రామానికి చెందిన పాశల రమకాంతం(37) బుధవారం తన కారుపై వ్యక్తిగత పని నిమిత్తం విజయనగరం వెళ్లాడు. తిరిగి అదేరోజు అర్ధరాత్రి స్వగ్రామానికి వస్తుండగా.. కొటారుబిల్లి కూడలి నుంచి చినమానాపురానికి వెళ్లేదారిలో గంట్యాడ గ్రామ పరిధిలో ఉన్న చెరువులోకి ప్రమాదవశాత్తు కారు దూసుకెళ్లింది. కారుతో పాటు నీటిలో మునిగిన రామకాంతంకు ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే మృతిచెం దాడు. గురువారం ఉదయం స్థానికులు చెరువులో కారును గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని, కారును బయటకు తీసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మృతుడికి తల్లి జగదాంబ, సోదరుడు ఉన్నారు. రామకాంతం తండ్రి గతంలో మృతిచెందగా, సోదరుడు దుబాయ్‌లో ఉంటున్నాడు. ప్రస్తుతం మృతుడు రామకాంతం, తల్లి జగదాంబ కలిసి చినమానాపురంలో నివశిస్తున్నారు. అందిన ఫిర్యాదు మేరకు గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 09 , 2026 | 12:03 AM