Share News

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:04 AM

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమా దంలో కానిస్టేబుల్‌, హోంగార్డుకు గాయాలయ్యాయి.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

  • కానిస్టేబుల్‌, హోంగార్డుకు గాయాలు

దత్తిరాజేరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమా దంలో కానిస్టేబుల్‌, హోంగార్డుకు గాయాలయ్యాయి. స్టేషన్‌ బూర్జవలస ఎస్‌ఐ జి.రాజేష్‌ గురువారం తెలిపిన వివరాల మేరకు.. పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న కాని స్టేబుల్‌ ఎ.రామకృష్ణ, హోంగార్డు రాము బుధవారం అర్ధరాత్రి ప్రభుత్వ ద్విచ క్రవాహనంపై మానాపురం వైపు నుంచి రామభద్రపురం వైపు వెళ్తుండగా.. బూ ర్జవలస పోలీసుస్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వీరిద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే వీరిద్దరినీ 108 వాహనం లో గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 10 , 2026 | 12:04 AM