Share News

కారు బీభత్సం

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:28 AM

మండలంలోని బొద్దాం జంక్షన్‌లో గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది.

కారు బీభత్సం

  • ఆటోను, నడిచివెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టిన వైనం

  • ఒకరి మృతి

  • ఆటో డ్రైవర్‌కు గాయాలు

వేపాడ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొద్దాం జంక్షన్‌లో గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఎస్‌.కోట వైపు నుంచి వస్తున్న కారు అదే దారిలో వస్తున్న ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఇంతటితో ఆగక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వేపాడ మండలం బొద్దాం గ్రామానికి చెందిన కోట్ని అప్పారావు అనే వ్యక్తిని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అప్పారావు రోడ్డుపై తుళ్లిపడిపోయాడు. అయితే అదే కారు అతనిపై నుంచి కూడా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్పారావును స్థానికులు ఎస్‌.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే కారు ఢీకొట్టిన ఆటో డ్రైవర్‌కు కుడి చేయి విరిగిపోయింది. ఈయన్ని కూడా ఎస్‌.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పారావు పరిస్థితి విషమిం చడంతో విశాఖపట్నం పెద్దాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందా డు. ఇందుకు సంబంధించి ఎస్‌.కోట ఆసుపత్రి నుంచి ఇచ్చిన సమాచారం మేరకు వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదా నికి కారణమైన కారును పోలీసులు ఎల్‌.కోట సమీపంలో పట్టుకున్నారు.

Updated Date - Nov 13 , 2026 | 12:28 AM