Share News

వ్యాను ఢీకొట్టిన ఘటనలో కారు దగ్ధం

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:36 AM

బొబ్బిలిలోని ఫ్లైఓవర్‌పై శనివారం రాత్రి వ్యాన్‌, కారు ఢీకొన్న ఘటనలో కారు దగ్ధమైంది.

వ్యాను ఢీకొట్టిన ఘటనలో కారు దగ్ధం

బొబ్బిలి, సెప్టెంబరు 19 (ఆంధ్ర జ్యోతి): బొబ్బిలిలోని ఫ్లైఓవర్‌పై శనివారం రాత్రి వ్యాన్‌, కారు ఢీకొన్న ఘటనలో కారు దగ్ధమైంది. స్థానికు లు, పోలీసుల కథనం మేరకు.. విజయనగరం నుంచి బొబ్బిలి వైపు కారు వస్తోంది. బొబ్బిలి నుంచి రామ భద్రపురం వైపు పాల వ్యాన్‌ వెళ్తోంది. దీనిని కారు ఢీకొనడంతో వెంటనే కారులో మంటలు వ్యాపించాయి. సుమారు 50 శాతం కారు దగ్ధమ య్యింది. సమాచారం తెలిసిన వెంటనే సీఐ కింతలి నారాయణరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సీఐ అగ్నిమాపక కేం ద్రానికి సమాచారం అందించారు. వారు మంటలను అదుపులోకి తెచ్చారు. కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి వ్యాన్‌ మీదకు వచ్చే స్తుండడంతో వ్యాన్‌లో ఉన్నవారు అప్రమత్తమై వాహనం నుంచి బయటకు వచ్చే యడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ రెండు వాహనాలు బొబ్బిలి పట్టణానికి చెందినవే. అప్రమత్తంగా ఉండడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, కారు 50 శాతం కాలిపోయిందని సీఐ నారా యణరావు తెలిపారు.

Updated Date - Sep 20 , 2026 | 12:36 AM