Share News

అదుపు తప్పిన కారు.. ఐదుగురికి గాయాలు

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:11 AM

విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం డాకమర్రి వద్ద మంగళవారం 10-30 గంటలకు ఓ కారు అదుపు తప్పింది.

అదుపు తప్పిన కారు.. ఐదుగురికి గాయాలు

విజయనగరం క్రైం, మార్చి 31(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం డాకమర్రి వద్ద మంగళవారం 10-30 గంటలకు ఓ కారు అదుపు తప్పింది. అక్కడే పైడితల్లమ్మ ఉత్సవాలకు వచ్చి రోడ్డు పక్కన నిల్చున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ కారు విశాఖ నుంచి విజయనగరం వైపు వస్తోంది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యా యి. వీరిని 108 అంబులెన్స్‌లో విజయనగరం సర్వజ న ఆసుపత్రికి తరలించారు. ఐదుగురూ అక్కడ చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 12:11 AM