టైరు పేలి.. అదుపు తప్పిన కారు
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:24 AM
టైరు పేలడంతో అదుపు తప్పిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొట్టి రైలింగ్‌పైకి దూసుకె ళ్లింది.
డివైడర్‌ను ఢీకొట్టి.. పల్టీలు కొట్టి.. రైలింగ్‌పైకి దూసుకెళ్లిన వైనం
ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు
పూసపాటిరేగ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): టైరు పేలడంతో అదుపు తప్పిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొట్టి రైలింగ్‌పైకి దూసుకె ళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళ లకు తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని కోనాడ జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరి గిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బోరువంక గ్రామానికి గున్న రామనాథం అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో శుక్రవారం కారులో రాజమండ్రి నుంచి తన స్వగ్రామం వెళ్తున్నారు. కోనాడ జంక్షన్ సమీపంలోకి వచ్చేసరికి కారు ముందు టైరు పేలిపోయింది. దీం తో కారు అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొంది. అనంతరం పల్టీలు కొట్టి.. సర్వీస్ రోడ్డు రైలింగ్‌పైకి దూసికెళ్లింది. అయితే వెంటనే కారులో ఎయిర్‌బ్యాగులు తెరుచు కోవడంతో రామనాథంతో పాటు తన కుమారుడు వెంకట సాయి సుమంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెనుక కూర్చొన్న తన భార్య లక్ష్మీబాయి, కుమార్తె కాత్యాయనిలకు బలమైన గాయాలయ్యాయి. సాయిసుమంత్ కారును డ్రైవ్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రామనాథం వైఎస్‌ఆర్ హార్టీకల్చర్ యూనివర్సిటీలో రీసెర్చ్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తూ ఉద్యానవన విభాగంలో సైంటిస్ట్‌గా ఎన్నో వంగడాలను అభివృద్ధి చేయటంలో కీలకపాత్ర వహించారు. అయితే 2026 మే నెలలో పదవీ విరమణ పొంది ఇప్పటికీ తన సేవలను అందజేస్తున్నారు.