Share News

Yet Bidding Farewell… వీడలేమంటూ.. వీడుకోలంటూ..

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:20 AM

Can’t Let Go… Yet Bidding Farewell… వీడలేమంటూ.. వీడుకోలంటూ.. ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులు.. తమ మిత్రులకు బాయ్‌ బాయ్‌ చెబుతూ.. ఇళ్లకు పయనమయ్యారు. బుధ‌వారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులకు టెన్షన్‌ తప్పింది. అయితే పరీక్షలు ఎంతో బాగా రాశామనే ఆనందం ఉన్నా.. రెండేళ్ల పాటు కలిసి చదువుతున్న స్నేహితులను వీడుతున్నామనే బాధలో చాలామందిలో కనిపించింది.

 Yet Bidding Farewell… వీడలేమంటూ.. వీడుకోలంటూ..
బొడ్డవలస బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటున్న ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులు

  • ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థుల ఆవేదన

  • ముగిసిన పరీక్షలు

  • మిత్రులను వదిలి ఇళ్లకు పయనం

సాలూరు రూరల్‌, మార్చి18(ఆంధ్రజ్యోతి): వీడలేమంటూ.. వీడుకోలంటూ.. ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులు.. తమ మిత్రులకు బాయ్‌ బాయ్‌ చెబుతూ.. ఇళ్లకు పయనమయ్యారు. బుధ‌వారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులకు టెన్షన్‌ తప్పింది. అయితే పరీక్షలు ఎంతో బాగా రాశామనే ఆనందం ఉన్నా.. రెండేళ్ల పాటు కలిసి చదువుతున్న స్నేహితులను వీడుతున్నామనే బాధలో చాలామందిలో కనిపించింది. అప్పుడే రెండేళ్లు గడిచాయా? మళ్లీ కలుస్తామో! లేదోనని మథన పడ్డారు. కళాశాలలో చేసిన అల్లరి, ఆటపాటలు, లెక్చరర్లతో తిన్న తిట్లును తలుచుకుని.. గురుకుల ,ఆశ్రమ, ఆదర్శ, కేజీబీవీలకు చెందిన ఇంటర్‌ రెండో ఏడాది విద్యార్థులు బరువెక్కిన హృదయాలతో ఇళ్లకు బయల్దేరారు. ఇకపై మొబైల్‌లో తప్పనిసరిగా మాట్లాడుకోవాలని స్నేహితులకు వీడ్కోలు చెప్పారు.

సాలూరు మండలం బొడ్డవలస బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో నెలిపర్తికి చెందిన బి.సంజకుమార్‌, బొబ్బిలికి చెందిన బి.రాజేష్‌, బి.శ్రీధర్‌ ఇంటర్‌(ఎంపీసీ) చదివారు. జీగిరాం నకు చెందిన ఆర్‌.జోస్వా, కురుకూటికి చెందిన ఎం.చరణ్‌తేజ, చిట్టి సీతారాంపురానికి చెందిన సీహెచ్‌.రఘరాం అదే గురుకులంలో బైపీసీ చదివారు. ఈ రెండేళ్లలో వారు మంచి స్నేహితులయ్యారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నారు. ఇప్పుడు ఇంటర్‌ పరీక్షలు ముగియ డంతో వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ఇలాగే తమ స్నేహం కలకాలం కొనసాగాలని కాంక్షిస్తూ ఇళ్లకు పయనమయ్యారు. కాగా గురుకులంలో ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలు రాసి ఇళ్లకు వెళ్తున్న విద్యార్థులందరీ పరిస్థితి ఇలాగే ఉందని గణిత అధ్యాపకుడు మూడడ్ల తిరుపతిరావు తెలిపారు. ఇన్నాళ్లు తమతో గడిపిన వారితో ఒక అనుబంధం ఏర్పడిందన్నారు. వారు గుకులాన్ని వదిలి వెళ్లిపోతుంటే ప్రిన్సిపాల్‌, అధ్యాపక బృందానికి సైతం బాధగా ఉందని తెలిపారు.

Updated Date - Mar 19 , 2026 | 12:20 AM