Share News

రంగంలోకి గంజాయి డిటెక్షన్‌ కిట్లు

ABN , Publish Date - May 17 , 2026 | 12:25 AM

గంజాయి తీసుకున్న వారిని పట్టుకునేం దుకు పోలీసు శాఖ గంజాయి డిటెక్షన్‌ కిట్లను రంగంలోకి దింపిందని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు.

రంగంలోకి గంజాయి డిటెక్షన్‌ కిట్లు

  • నిమిషంలో నిర్ధారణ

  • ప్రత్యేక బృందాల ఏర్పాటు

  • ఎస్పీ దామోదర్‌

విజయనగరం, మే 16(ఆంధ్రజ్యోతి): గంజాయి తీసుకున్న వారిని పట్టుకునేం దుకు పోలీసు శాఖ గంజాయి డిటెక్షన్‌ కిట్లను రంగంలోకి దింపిందని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. యాంటీ గంజాయి టీం, ఈగల్‌ టీం శనివారం నిర్వహించి న తనిఖీల్లో విజయనగరం పట్టణం, వీటీ అగ్రహారం, బీసీ కాలనీకి చెందిన మాడుగుల మహేష్‌ను డ్రగ్‌ డిటెక్షన్‌ కిట్‌ ద్వారా పరీక్షించగా.. గంజాయి తీసుకు న్నట్టు నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. ఈ గంజాయి డిటెక్షన్‌ కిట్లు అత్యా ధునిక సంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారని, వీటి ద్వారా కేవలం ఒక నిమిషంలోనే వ్యక్తి గంజాయి తీసుకున్నాడా లేదా.. అని నిర్ధారణ చేయవచ్చని ఎస్పీ తెలిపారు. జిల్లాలో గంజాయి నియంత్రణ కోసం పోలీస్‌, ఈగల్‌ అధికారు లు, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. పాఠ శాలలు, కళాశాలలు, ఇతర అనుమానాస్పద ప్రదేశాల్లో తరచూ తనిఖీలు నిర్వహి స్తామన్నారు. అలాగే జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెంచినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌ పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు కఠినతరం చేశామని చెప్పారు. గంజాయి తీసుకుంటే జైలు తప్పదని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Updated Date - May 17 , 2026 | 12:25 AM