కాలువలు నిర్మించారు.. నిర్వహణ మరిచారు
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:13 AM
భోగాపురం గ్రామ పరిధిలో సర్వీసు రోడ్డుకు ఇరువైపులా వర్షపు నీరు పోయేవిధంగా హైవే విస్తరణాధికారులు కాలువ లు నిర్మించారు.
సర్వీసు రోడ్డుపై పొంగి ప్రవహిస్తున్న వర్షపునీరు
అవస్థలు పడుతున్న వాహనచోదకులు
భోగాపురం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): భోగాపురం గ్రామ పరిధిలో సర్వీసు రోడ్డుకు ఇరువైపులా వర్షపు నీరు పోయేవిధంగా హైవే విస్తరణాధికారులు కాలువ లు నిర్మించారు. అయితే వీటిని నిర్మించి ఏళ్లు గడుస్తు న్నా వాటిని పట్టించుకునే దాఖలాలు లేవు. దీంతో ఈ కాలువల్లో పూడిక నిండిపోయింది. దీంతో కొద్దిపా టి వర్షం పడినా ఈ కాలువల గుండా ప్రవహించ డానికి వీలుకాక వర్షపు నీరు రోడ్డుపైనే ప్రవహి స్తోంది. ఇప్పటికైనా ఎన్‌హెచ్ అధికారులు స్పందించి సర్వీసు రోడ్డుకు ఇరువైపుల ఉన్న కాలవల్లో పూడిక తొలగించి, వర్షపునీరు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహన చోద కులు కోరుతున్నారు.