Share News

Kharif కాలువ పనులు సరే.. ఖరీఫ్‌ సాగుకు నీరొస్తుందా?

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:24 AM

Canal Works Done, But Will Kharif Get Water? వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌) ప్రాజెక్టు పరిధిలో కాలువల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఓఎన్‌డీఎం నిధులు సుమారు రూ. కోటితో కుడి ప్రధాన కాలువతోపాటు ఆర్‌బీసీలోని కాలువల్లో పూడికతీతలు, తుప్పలు, డొంకలను తొలగిస్తున్నారు.

 Kharif  కాలువ పనులు సరే.. ఖరీఫ్‌ సాగుకు నీరొస్తుందా?
వీఆర్‌ఎస్‌ కుడిప్రధాన బ్రాంచి కాలువలో పూడిక తీత పనులుచేపడుతున్న దృశ్యం

  • స్పష్టం చేసిన అధికారులు.. ఆందోళనలో రైతులు

మక్కువ. జూలై27(ఆంధ్రజ్యోతి): వెంగళరాయసాగర్‌ (వీఆర్‌ఎస్‌) ప్రాజెక్టు పరిధిలో కాలువల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఓఎన్‌డీఎం నిధులు సుమారు రూ. కోటితో కుడి ప్రధాన కాలువతోపాటు ఆర్‌బీసీలోని కాలువల్లో పూడికతీతలు, తుప్పలు, డొంకలను తొలగిస్తున్నారు. అయితే ప్రాజెక్టులో నీటి నిల్వలు మాత్రం 30 శాతమే ఉన్నాయి. 1.683 టీఎంసీలకు గాను 0.60 టీఎంసీలే ఉన్నాయి. దీంతో ఖరీఫ్‌ సాగుకు నీరు విడుదల ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో లేదా ఎగువ ప్రాంతం ఒడిశాలో వర్షాలు కురిస్తేనే ఆగస్టు మొదటివారంలో సాగునీరు విడుదల చేయ గలమని ప్రాజెక్టు చైర్మన్‌ మత్స గోదావరి, డీఈఈ డి.సురేష్‌ తెలిపారు. ఏదేమైనా ప్రాజెక్టులో ఇంకా ఒక టీఎంసీ నీరు చేరాల్సి ఉందని అంటున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు నీటి ఇక్కట్లు తప్పేలా లేవని తలలు పట్టుకుంటున్నారు.

Updated Date - Jul 28 , 2026 | 12:24 AM