Can You Teach Lessons Effectively? పాఠాలు బోధించడం వచ్చా..?
ABN , Publish Date - May 01 , 2026 | 11:38 PM
Can You Teach Lessons Effectively? గిరిజన విద్యార్థులకు అర్ధమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడం మీకు వచ్చా?’ అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ అధ్యాపకులను ప్రశ్నించారు. పెద్దమడి గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ఉత్తీర్ణత 19.76 శాతంగా నమోదవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ కళాశాలలో పనిచేస్తున్న 11 మందికి అధ్యాపకులకు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా వీరి బోధన సామర్థ్యాలు పరిశీలించేందుకు శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో పీవో, డీడీ అన్నాదొర ఆధ్వర్యంలో డెమో క్లాసులు నిర్వహించారు.
ఫలితాల సాధనలో వెనకబడినందుకు నోటీసులు జారీ
సీతంపేట రూరల్, మే1(ఆంధ్రజ్యోతి): ‘గిరిజన విద్యార్థులకు అర్ధమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడం మీకు వచ్చా?’ అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్ జగన్నాథ్ అధ్యాపకులను ప్రశ్నించారు. పెద్దమడి గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ఉత్తీర్ణత 19.76 శాతంగా నమోదవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ కళాశాలలో పనిచేస్తున్న 11 మందికి అధ్యాపకులకు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా వీరి బోధన సామర్థ్యాలు పరిశీలించేందుకు శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాల యంలో పీవో, డీడీ అన్నాదొర ఆధ్వర్యంలో డెమో క్లాసులు నిర్వహించారు. పెద్దమడి గిరిజన గురు కుల బాలుర జూనియర్ కళాశాలలో అధ్యాపకులను సబ్జెక్ట్‌ల వారీగా పిలిచి వారిచ్చే డెమో క్లాసు లను ఇన్‌చార్జి పీవో పరిశీలించారు. కాగా సబ్జెక్ట్‌లు బోధించే అధ్యాపకులు పుస్తకాలతో కుస్తీప ట్టారు. గడిచిన కొన్నేళ్లుగా అదే కళాశాలలో ఉత్తమ ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం తమకేంటీ ఈ పరిస్థితి పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై గిరిజనసంక్షేమశాఖ డీడీ ఎం.అన్నాదొరను వివరణ కోరగా.. ‘పెద్దమడి గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఈ ఏడాది ఆశించిన ఫలితాలు రాలేదు. దీనిపై అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులకు ఇటీవల షోకాజ్ నోటీ సులు జారీచేశాం. అధ్యాపకుల స్కిల్స్‌ను తెలుసుకునేందుకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఆధ్వర్యంలో డెమోక్లాసులు నిర్వహించాం.’ అని తెలిపారు.
ఇదీ పరిస్థితి..
పెద్దమడి గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు చెందిన 86మంది ఈ ఏడాది పరీక్షలు రాయగా.. వారిలో 17మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన 69 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఎంపీసీలో 10, బైపీసీలో 37, సీఈసీ గ్రూప్‌లో 22మంది ఫెయిలయ్యారు. దీంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులపై ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, డీడీలు అసంతృప్తి వ్యక్తంచేశారు. కాగా ఇదే కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 48.35 శాతం ఫలితాలు వచ్చాయి.