Share News

Campaigning నేటితో ప్రచారానికి తెర

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:34 PM

Campaigning Ends Today ప్రాదేశిక పోరులో కీలక ఘట్టమైన ప్రచార పర్వానికి నేటితో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ప్రచారాలకు గడువు ముగియనుంది. ఈనెల 5న పోలింగ్‌, ఏడో తేదీన కౌంటింగ్‌ నిర్వహించ నున్నారు.

Campaigning  నేటితో ప్రచారానికి తెర

  • 5న పోలింగ్‌, 7న కౌంటింగ్‌

పార్వతీపురం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రాదేశిక పోరులో కీలక ఘట్టమైన ప్రచార పర్వానికి నేటితో తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ప్రచారాలకు గడువు ముగియనుంది. ఈనెల 5న పోలింగ్‌, ఏడో తేదీన కౌంటింగ్‌ నిర్వహించ నున్నారు. కాగా నిబంధనల ప్రకారం 48 గంటల ముందు లౌడ్‌ స్పీకర్లు, బహిరంగ సభలు, ర్యాలీలతో కూడిన ప్రచారాలకు తెరపడనుంది. అయితే ఇదే సమయంలో కొందరు అభ్యర్థులు ప్రలోభాలతో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొమరాడ మండలంలో ఒకరు ఎన్నికల అధికారులకు పట్టుబడ్డారు. కాగా జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 52 మంది, 226 ఎంపీటీసీ స్థానాలకు గాను 534 మంది బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రాదేశిక పోరులో ఉన్నారు. గెలుపై లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. డ్రోన్లు, సీసీ కెమెరాలు, వీడియో గ్రాఫర్ల ద్వారా నిరంతర నిఘాకు చర్యలు చేపడుతున్నారు.

నిబంధనలు పాటించాలి: కలెక్టర్‌

ఎన్నికల నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. 5న ఎన్నికలు జరగనుండగా.. మంగళవారం సాయంత్రానికి ప్రచారాలకు గడువు ముగుస్తుందన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో బయట వ్యక్తులు ఉండరాదని తెలిపారు. సోషల్‌ మీడియాపైనా నిఘా ఉంటుందన్నారు. నేటి సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలన్నారు. 7న ఓట్ల లెక్కింపు కేంద్రాల చట్టూ ఐదు కిలోమీటర్లు పరిధిలోని మద్యం విక్రయాలు నిలిపివేయాలన్నారు. అక్రమ మద్యం సమాచారం తెలిస్తే.. ఈ 89873 89271 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Updated Date - Nov 02 , 2026 | 11:34 PM