Share News

శుభకార్యానికి వచ్చి.. కాలువలో కాలుజారి..

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:29 AM

ఏగోటివలస సమీ పంలో తోటపల్లి ఎడమ కాలువలో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి గల్లంతైన ఘటన మంగళవారం చో టుచేసుకుంది.

 శుభకార్యానికి వచ్చి.. కాలువలో కాలుజారి..

  • వ్యక్తి గల్లంతు

  • మృతుడు కృష్ణా జిల్లా ఉయ్యూరు వాసి

సీతానగరం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఏగోటివలస సమీ పంలో తోటపల్లి ఎడమ కాలువలో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి గల్లంతైన ఘటన మంగళవారం చో టుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కృష్ణా జిల్లా ఉయ్యూ రు శ్రీలంక కాలనీకి చెందిన ఎం.హేమంత్‌ కృష్ణ(39) ఏగోటి వలస గ్రామంలోని తన మిత్రుడి ఇంట్లో జరిగిన బారసాల శుభ కార్యానికి హాజరయ్యేం దుకు వచ్చారు. ఈ క్రమంలో గ్రా మ సమీపంలోని తోటపల్లి ఎడమ కాలువలో స్నానం చేసేందు కు వెళ్లాడు. కాలువలో ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డారు. సమాచారం అందు కున్న పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టా రు. అయితే సాయంత్రం వరకు హేమంత్‌కృష్ణ ఆచూకీ లభించలేదని ఎస్‌ఐ ఎం.హేమలత తెలిపారు. విషయం తెలుసుకున్న హేమంత్‌ కృష్ణ కుటుంబ సభ్యు లు ఏగోటివలసకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఎస్‌ఐ హేమలత, తహసీ ల్దార్‌ ప్రసన్నకుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి గాలింపు చర్యలను పర్యవేక్షిం చారు. హేమంత్‌కృష్ణ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Updated Date - Sep 23 , 2026 | 12:29 AM