Share News

లెక్క తేలింది

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:48 AM

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌) ప్రక్రియలో భాగంగా జిల్లాకు సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.

లెక్క తేలింది

  • ఓటర్ల జాబితాలో అనర్హుల గుర్తింపు

  • మొత్తం ఓటర్లు 15,78,949 మంది

  • మరణించిన వారు 55,958 మంది

  • 31న ముసాయిదా జాబితా విడుదల

విజయనగరం కలెక్టరేట్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌) ప్రక్రియలో భాగంగా జిల్లాకు సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. బూత్‌లెవల్‌ అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వేలో జిల్లావ్యాప్తంగా బోగస్‌, మరణించిన, వలస వెళ్లిన ఓటర్లను గుర్తించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జిల్లాలో 15,78,949 మంది ఓటర్లు ఉండగా.. శతశాతం ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశారు. ఏడు నియోజకవర్గాల్లో 1847 బీఎల్‌వోలు ఇంటింటా సర్వే చేశారు. స్వీయ మ్యాపింగ్‌ 6,09,118 (38.58 శాతం) జరిగింది. కుటుంబ సభ్యుల ద్వారా 8,27,009 (52.38 శాతం) మ్యాపింగ్‌ జరిగింది. జిల్లా వ్యాప్తంగా 14,945 (0.95 శాతం) మంది వివరాలు మ్యాపింగ్‌ కాలేదు. అన్‌కలెక్టబుల్‌ 1,27.877 (8.10శాతం), వారిలో మరణించిన వారు 55,958 (3.54శాతం), అన్‌ ట్రేసుబుల్‌ 17,425 (1.10శాతం), శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు 36,185 (2.29శాతం), ఫారాలు ఇవ్వడానికి నిరాకరించిన వారు 92 మంది ఉన్నారు. మరోచోట నమోదు చేసుకున్న వారు 18,217 (1.15శాతం) ఉన్నారు. ఈనెల 31న ఎన్నికల కమిషన్‌ ముసాయిదా జాబితా విడుదల చేస్తుంది.

Updated Date - Jul 26 , 2026 | 12:48 AM