Share News

business with sand ‘గుట్ట’గా వ్యాపారం

ABN , Publish Date - Aug 28 , 2026 | 12:04 AM

business with sand ఆ ఫొటోలోని ఇసుక పోగులు గోస్తనీ నదీ పరివాహక ప్రాంతంలోని ఓ గ్రామంలో వేసినవి. ఆ గ్రామ రోడ్లు, కళ్లాలు, తోటలు ఇలా అన్నిచోట్లా నిల్వచేసేశారు. గ్రామానికి ఆనుకుని వున్న నదీ పరివాహక ప్రాంతం నుంచి నాటుబళ్లతో ఇసుకను సేకరిస్తున్నారు. గుట్టలుగా డంపింగ్‌ చేసిన ఇసుకను అవకాశం ఉన్నప్పుడల్లా అమ్ముకుంటున్నారు. ట్రాక్టర్‌లు, లారీల ద్వారా గృహా వినియోదారులకు తరలిస్తున్నారు. ఇదంతా సంబంధిత శాఖ అధికారుల కళ్లేదుటే జరుగుతోంది. చర్యలు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

business with sand ‘గుట్ట’గా వ్యాపారం
ఎస్‌.కోట మండలంలోని గోస్తనీ పరివాహక ప్రాంతంలో వేసిన ఇసుక నిల్వలు

‘గుట్ట’గా వ్యాపారం

గోస్తనీ నదీ పరివాహక గ్రామాల్లో ఎక్కడికక్కడే ఇసుక నిల్వలు

బహిరంగ ప్రదేశాల్లో డంపింగ్‌ చేస్తున్న అక్రమార్కులు

తెలిసీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు

నాటు బండ్లతో తీసుకువచ్చి ఆపై ట్రాక్టర్‌, లారీలతో తరలింపు

- ఆ ఫొటోలోని ఇసుక పోగులు గోస్తనీ నదీ పరివాహక ప్రాంతంలోని ఓ గ్రామంలో వేసినవి. ఆ గ్రామ రోడ్లు, కళ్లాలు, తోటలు ఇలా అన్నిచోట్లా నిల్వచేసేశారు. గ్రామానికి ఆనుకుని వున్న నదీ పరివాహక ప్రాంతం నుంచి నాటుబళ్లతో ఇసుకను సేకరిస్తున్నారు. గుట్టలుగా డంపింగ్‌ చేసిన ఇసుకను అవకాశం ఉన్నప్పుడల్లా అమ్ముకుంటున్నారు. ట్రాక్టర్‌లు, లారీల ద్వారా గృహా వినియోదారులకు తరలిస్తున్నారు. ఇదంతా సంబంధిత శాఖ అధికారుల కళ్లేదుటే జరుగుతోంది. చర్యలు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- శృంగవరపుకోట మండల పరిధిలోని ఓ చెరువు ఆక్రమణ ఫిర్యాదుపై తహసీల్దార్‌ డి.శ్రీనివాసరావును వివరణ అడిగేందుకు నాలుగు రోజుల క్రితం కొంత మంది స్థానిక మీడియా ప్రతినిధులు వెళ్లారు. డబ్బులు తీసుకొని చెరువుల ఆక్రమణకు అవకాశం ఇస్తున్నారని స్థానికులు అంటున్నట్లు సిబ్బంది వద్ద ప్రస్తావించారు. ‘ఇలాయితే మీరు కూడా ఇసుక, మట్టితో వస్తున్న టాక్టర్లను వదిలేయాలని ఫోన్‌ చేస్తున్నారని, నిన్న రాత్రే ఓ లారీతో పట్టుకున్న ఇసుకను వదిలేయాలని ఓ విలేకరి బతిమాలడంతో వదిలేసానని, మేమేమీ మీదగ్గర డబ్బులు తీసుకోలేదు కదా?’ అంటూ అక్కడే ఉన్న మరో అధికారి తిరిగి ప్రశ్నించారు.

శృంగవరపుకోట, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ తవ్వకాల నివారణ కోసం పనిచేసే ఏ శాఖ అధికారులను కదిపినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉన్నత స్థాయి అధికారుల వద్ద పరపతి వున్న వారితో పాటు మీడియాకు చెందిన పలువురు అడ్డు పడుతున్నారని వారిని వారు సమర్థించుకుంటున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్న వారిపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. అప్పుడప్పుడు ఉనికిని కాపాడుకొనేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ ఎటువంటి అధికార బలం లేని అల్పుల మీద మాత్రమే ప్రతాపం చూపగలుగుతున్నారు. అవసరం కోసం ఇసుకను తీసుకొళ్లేవారే బలివుతున్నారు. కాగా ఇసుక అక్రమ తవ్వకాలపై సంబంధిత అధికారులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, అనంతగిరి కొండల నుంచి గోస్తనీ నది ప్రవహిస్తోంది. శృంగవరపుకోట, జామి మండలాలతో పాటు విశాఖ జిల్లా పద్మనాభం మండలం నుంచి వెళ్తూ తగరపువలస తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకుని వున్న చాలా గ్రామాల్లోని వ్యక్తులు ఇసుకను తమ సొంత సొత్తుగా భావిస్తున్నారు. నదికి దూరంగా ఉన్న గ్రామాల వారిని ఇసుక కోసం దిగనివ్వడం లేదు. అదే సమయంలో వివిధ గ్రామాలకు తాగునీటి అవసరాల కోసం తవ్విన ఊట బావులు, బ్రిడ్జిల వద్ద కూడా ఇసుకను లోతుగా తవ్వేస్తున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతమంతా చిధ్రమవుతోంది.

అవకాశాన్ని స్వాహాకు ఉపయోగిస్తూ..

కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానికుల అవసరాల నిమిత్తం ఇసుకను తవ్వుకొనేందుకు అవకాశం ఇచ్చింది. అయితే ఇసుకను నాటు బళ్లతోనే తీసుకువెళ్లాలి. టాక్టర్లను నదిలో దించకూడదు. దీన్నే నది పరివాహక ప్రాంతాలకు చెందిన కొందరు తెలివిగా రాత్రీ పగులు అనే తేడా లేకుండా ఇసుకను తవ్వి నాటుబళ్లతో తీసుకొస్తున్నారు. రోడ్లు, కళ్లాలు, తోటలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో గుట్టలుగా పోగు వేస్తున్నారు. వీటిని ఇసుక అవసరమైన ఇతర గ్రామాలకు అమ్ముతున్నారు. వీరే టాక్టర్లు, లారీలతో కొనుగోలుదారు చూపించిన స్థలానికి తరలిస్తున్నారు. గోస్తనీ నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకుని వున్న అన్ని గ్రామాల్లోనూ ఇదే తంతు నడుస్తోంది.

నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాల నివారణతో సంబంధం వున్న యంత్రాంగాన్ని తవ్వకందారులు పలు రకాలుగా మేనేజ్‌ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ బహిరంగ ప్రదేశాల్లో గుట్టలు, గుట్టలుగా కనిపిస్తున్న ఇసుక రాసులు వీరికి మాత్రం ఆనడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు ముందే సమాచారం ఇచ్చేస్తున్నారు. వాటిని అక్కడ నుంచి మాయం చేసిన తరువాత తీరిగ్గా వెళ్తున్నారు. తిరిగి ఫిర్యాదు చేసిన వారినే తప్పుపట్టడంతో పాటు దబాయిస్తున్నారు.

Updated Date - Aug 28 , 2026 | 12:04 AM