Bus Services to Waterfalls జలపాతాలకు బస్సులు
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:07 AM
Bus Services to Waterfalls కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో తోణాం, దళాయివలస, కుశ జలపాతాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని డీపీటీవో (జిల్లా ప్రజారవాణాధికారి ) వెంకటేశ్వరరావు, సాలూరు డిపో మేనేజర్ పి.ఆచారి శనివారం ప్రకటనలో తెలిపారు.
సాలూరు రూరల్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి ): కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో తోణాం, దళాయివలస, కుశ జలపాతాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని డీపీటీవో (జిల్లా ప్రజారవాణాధికారి ) వెంకటేశ్వరరావు, సాలూరు డిపో మేనేజర్ పి.ఆచారి శనివారం ప్రకటనలో తెలిపారు. కుశ జలపాతానికి ప్రతి శని, ఆదివారాల్లో పార్వతీపురంలో ఉదయం 8 గంటలకు, గుమ్మలక్ష్మీపురంలో ఉదయం 10 గంటలకు బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. అదే విధంగా సాలూరు నుంచి రెండు బస్సులు ఆయా జలపాతాలకు ఉదయం 10 గంటలకు బయలుదేరుతాయని, సాయంత్రం 4 గంటలకు ఆయా బస్సులు తిరుగు ప్రయాణమవుతాయని తెలిపారు.