పిల్లర్ల కింద మట్టిని పూడ్చరూ..
ABN , Publish Date - May 10 , 2026 | 12:33 AM
మండలంలోని భీమసింగి వంతెన కింద పిల్లర్లకు అనుసంధానంగా ఉన్న మట్టిని కొద్దిరోజుల కిందట ఇక్కడ రైల్వే పనులు నిర్వహించే కాంట్రాక్టర్ తవ్వి తమ పనులకు వినియోగించారు.
- సగం పూడ్చి వదిలేసిన వైనం
- వంతెనకు పొంచిఉన్న ప్రమాదం
జామి, మే 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని భీమసింగి వంతెన కింద పిల్లర్లకు అనుసంధానంగా ఉన్న మట్టిని కొద్దిరోజుల కిందట ఇక్కడ రైల్వే పనులు నిర్వహించే కాంట్రాక్టర్ తవ్వి తమ పనులకు వినియోగించారు. దీంతో ఇది వంతెన మనుగడకు ప్రమాదమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసి, ఆ పనులను అడ్డుకున్నారు. అలాగే రెవెన్యూ అధికారులు వెళ్లి, హెచ్చరించారు. దీనికి స్పందించిన కాంట్రాక్టర్ వద్ద సూపర్‌వైజర్లు.. తెలియక మట్టి తవ్వాం.. యాధావిధిగా కప్పేస్తామని తెలిపారు. వెంటనే మట్టి కప్పే ఏర్పాట్లు మొదలుపెట్టారు. గత రెండు రోజులుగా కొన్ని పిల్లర్ల కింద తీసిన మట్టిని యధావిధిగా కప్పారు. మిగత పిల్లర్ల వద్ద తీసిన మట్టిని పూడ్చకుండా వదిలేశారు. దీనిపై సంబంధిత పనివారిని విలేకర్లు ప్రశ్నించగా.. ఎందుకు అంత గాబరా ఇక్కడ రైల్వే పనులకు మట్టి తవ్వకాలు మొదలుపెడతాం.. అప్పుడే వీటిని కప్పేస్తాం.. అంటూ నిర్లక్ష్యదోరణితో చెప్పారు. ఈ వంతెనపై నిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి.. ఈ పిల్లర్లు బలంగా లేకపోతే ఎలా.. అంటూ యువత ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో సదరు కాంట్రాక్టర్‌తో మట్టి కప్పించే ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.