కాలువలు పూడ్చేసి.. లేఅవుట్లా?
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:08 AM
సాగునీటి కాలువలు పూడ్చేసి, లేఅవుట్లు వేయడం ఏమిటని భోగాపురం, నందిగాం గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భోగాపురం, నందిగాంవాసుల ఆందోళన
భోగాపురం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): సాగునీటి కాలువలు పూడ్చేసి, లేఅవుట్లు వేయడం ఏమిటని భోగాపురం, నందిగాం గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వీరు భోగాపురం తూర్పుఖండం ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లను సందర్శించారు. అక్కడ పూడ్చేసిన పంటకాలువలు పరిశీలించారు. బంగారమ్మ చెరువు నుంచి అప్పయ్యమ్మ చెరువుకు పంటకాలువ వెంబడి సాగునీరు ప్రవహిస్తుంటుందని, ఇప్పుడు ఈ పంటకా లువను పూడ్చేస్తే సాగునీరు ఎలా ప్రవహిస్తుందని వారు ప్రశ్నించారు. పంటకాలువలను యధావిధిగా ఏర్పాటు చేయలని, లేనిఎడల దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
చర్యలు తీసుకుంటాం..
దీనిపై ఇరిగేషన్ ఏఈఈ రమేష్ చంద్రను వివ రణ కోరగా.. అవి జిరాయితీ భూములు అని, అయితే దీనిపై రెవెన్యూ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.