క్యాంపులకు వెళ్లిన వారి ఇళ్లే లక్ష్యంగా చోరీలు
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:10 AM
కురుపాంలో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇటీవల క్యాంపులకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు.
కురుపాం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): కురుపాంలో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇటీవల క్యాంపులకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. వీటిలో రెండు ఇళ్ళు చోరీకి పాల్పడగా మరో ఇంట్లో చోరికి ప్రయత్నించి విఫలమయ్యారు.ఈ మేరకు నాలుగు తూలాల బంగారు ఆభరణాలు చోరీచేశారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. కురుపాం మెయిన్ రోడ్డలో గల జామి దేవిప్రసాద్ క్యాంపు వెళ్లడంతో తాళం పగలుగొట్టి ఇంటిలో చొరబడి నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లిపోయారు. జామి దేవీప్రసాద్ ఇటీవల క్యాంపు వెళ్ళినప్పుడు బ్యాంకు లాకర్‌లో తన విలువైన వస్తువులు కొన్ని ఉంచారు. శనివారం ఉదయం పక్క ఇళ్లలో ఉన్న వారు తలుపులు తీసి ఉండడం చూసి వారికి తెలియజేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే స్థానిక ప్యాలస్ రోడ్డులో గల కందులు శ్రీనివాసరావు అనారోగ్య సమస్యల వల్ల శుక్రవారం ఉదయం ఇంటికి తాళం వేసి క్యాంపు వెళ్ళగా రాత్రి దొంగలు తాళం పగలగొట్టి ఇంటిలో చొరబడ్డిరు. ఇంటిలో ఏమి దొరక్కపోవడంతో స్థానిక స్టేట్ బాంక్ ఎదురుగా ఉన్న కొత్తకోట మల్లిఖార్జునరావు వారంరోజులుగా క్యాంపు వెళ్లడంతో గమనించిన గుమ్మంలో ఉన్న గజాలు తలుపు తాళం పగలగొట్టారు. లోన ఉన్న కర్ర తలుపు రాకపోవడంతో వదిలి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ హరి, ఎస్‌ఐ నారాయణరావు సంఘటన స్థలం పరిశీలించి, క్లూస్ టీం తెప్పించి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భగా ఎస్‌ఐ నారాయణరావు మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నామన్నారు.