Share News

రోడ్డు వేయండి.. ప్రాణాలను కాపాడండి

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:03 AM

గిరి శిఖరాల్లో నివసిస్తున్న తమ ఊరుకి రహదారి నిర్మించాలని కొమరాడ మండలం నయా పంచాయతీ గొడ్డాం గ్రామానికి చెందిన గిరిజనులు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఆందోళన చేశారు.

రోడ్డు వేయండి.. ప్రాణాలను కాపాడండి
ఆందోళన చేస్తున్న గిరిజనులు

బెలగాం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : గిరి శిఖరాల్లో నివసిస్తున్న తమ ఊరుకి రహదారి నిర్మించాలని కొమరాడ మండలం నయా పంచాయతీ గొడ్డాం గ్రామానికి చెందిన గిరిజనులు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ఆందోళన చేశారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి.. ప్రాణాలను కాపాఆలని కోరారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వైద్యం కోసం డోలీలే దిక్కవుతున్నాయన్నారు. వైద్యం అందక ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతోందని గిరిజనులు ఆవేదన వెలిబుచ్చారు. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి శంకుస్థాపన చేశారన్నారు. అయితే పనులు మొదలు పెట్టి వెంటనే అటవీ శాఖ అనుమతులు లేవని రోడ్డు పనులు నిలిచి పోయాయన్నారు. తక్షణమే రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఇచ్చి డోలీల మోత నుంచి విముక్తి కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 24 , 2026 | 12:03 AM