Share News

ఫైనల్‌కు బిటివాడ, సీతంపేట జట్లు

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:25 AM

పట్టణంలో నిర్వహిస్తున్న ఎన్‌జీఆర్‌ మెమోరియల్‌ క్రికెట్‌ ప్రీమియం లీగ్‌ టోర్నీలో బిటివాడ, సీతంపేట జట్లు ఫైనల్‌కు చేరాయి.

ఫైనల్‌కు  బిటివాడ, సీతంపేట జట్లు
క్రీడాకారులతో నిర్వాహకులు

పాలకొండ, మే 31 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో నిర్వహిస్తున్న ఎన్‌జీఆర్‌ మెమోరియల్‌ క్రికెట్‌ ప్రీమియం లీగ్‌ టోర్నీలో బిటివాడ, సీతంపేట జట్లు ఫైనల్‌కు చేరాయి. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రెండు స్థానాలకు బిటివాడ, సీతం పేట జట్లు... మూడు, నాలుగు స్థానాలకు బత్తిలి, భామిని అర్హత సాధిం చాయని నిర్వాహకులు తెలిపారు. ఫైనల్‌ పోటీ నిర్వహించే తేదీని త్వరలో ప్రకటించనున్నామని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Jun 01 , 2026 | 12:25 AM