Share News

విరిగిన విద్యుత్‌ స్తంభాలు

ABN , Publish Date - Jun 21 , 2026 | 11:52 PM

పాలెం గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ ఆదివారం రెండు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి.

విరిగిన విద్యుత్‌ స్తంభాలు
ఇంటిపైౖ పడిన విద్యుత్‌ స్తంభం

కొమరాడ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) పాలెం గ్రామం వద్ద ప్రమాదవశాత్తూ ఆదివారం రెండు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్డు రోలర్‌ను తీసుకు వెళ్తున్న లారీ విద్యుత్‌ తీగలను బలంగా లాగేయడంతో రెండు స్తంభాలు విరిగి ఇళ్లపై పడ్డాయి. దాంతో గ్రామంలో పూర్తిగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై విద్యుత్‌శాఖ ఏఈ వెంకటరమణకు వివరణ అడగగా ప్రమాదం జరగడం వాస్తవమేనన్నారు. ఆదివారం సాయంత్రానికి గ్రామానికి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించామన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 11:52 PM