Share News

నేత్రదానంతో అంధుల జీవితాల్లో వెలుగులు

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:07 AM

నేత్ర దానంతో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి అన్నారు.

నేత్రదానంతో అంధుల జీవితాల్లో వెలుగులు
అంగీకార పత్రాలపై సంతకాలు చేస్తున్న ఉపాధ్యాయులు

పార్వతీపురం రూరల్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): నేత్ర దానంతో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని డీఎంహెచ్‌వో విజయలక్ష్మి అన్నారు. శనివారం జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా నర్సిపురం ఉన్నత పాఠశాలలో నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మరణానంతరం నేత్రదానం చేసి అంధత్వ నివారణకు సహకరించాలని కోరారు. జిల్లా నేత్ర వైద్యాధికారి నగేష్‌రెడ్డి, ప్రగ్రాం మేనేజర్‌ డాక్టర్‌ జగన్మోహన్‌రావు నేత్రదానంపై అపోహ లను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం సత్యనారాయణ, సీఆర్‌పీ అనురాధతో పాటు పలువురు ఉపాధ్యాయులు నేత్రదానానికి అంగీకార పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ శ్రీరాములు, ఎల్‌హెచ్‌పీ రాజేశ్వరి, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:07 AM