క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - May 06 , 2026 | 12:14 AM
క్రీడాకారు లకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి కొండపల్లి
విజయనగరం టౌన్, మే 5(ఆంధ్రజ్యోతి): క్రీడాకారు లకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో మంగళవారం ఏపీ ఐదో తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులకు ఉద్యో గాల్లో 3 శాతం కోటా ఇస్తోందని, ఇటీవల డీఎస్సీలో 420 మందికి ఈ కోటాలో ఉద్యోగాలు అందాయని తెలి పారు. జిల్లా క్రీడా అధికారి వెంకటే శ్వరరావు, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం, తైక్వాండో అధ్యక్షుడు గురాన అయ్యలు, గౌర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోష్, అసోసియేషన్ కార్యదర్శి శ్రీహరి, అచ్చుంనాయుడు, కె.గోపాల్ పాల్గొన్నారు.