Chittagedda చిట్టగెడ్డపై వంతెన నిర్మిస్తాం
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:59 PM
Bridge to Be Constructed Across Chittagedda మార్కొండపుట్టి సమీపంలోని చిట్టగెడ్డపై వంతెన నిర్మాణం చేపట్టి గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఉమ్మడి జిల్లా ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్ ఇంజనీరు కె.కాంతిమతి తెలిపారు. సోమవారం ఆ ప్రాంతంలో శిథిలమైన కాజ్‌వేను పరిశీలించారు. అనంతరం ప్రజలు, రైతులతో మాట్లాడారు.
శిథిలమైన కాజ్‌వే పరిశీలన
మక్కువ, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): మార్కొండపుట్టి సమీపంలోని చిట్టగెడ్డపై వంతెన నిర్మాణం చేపట్టి గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఉమ్మడి జిల్లా ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్ ఇంజనీరు కె.కాంతిమతి తెలిపారు. సోమవారం ఆ ప్రాంతంలో శిథిలమైన కాజ్‌వేను పరిశీలించారు. అనంతరం ప్రజలు, రైతులతో మాట్లాడారు. సుమారు 20 ఏళ్ల కిందట పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో కాజ్‌వే నిర్మాణం చేపట్టారని టీడీపీ మండల అధ్యక్షుడు అద్యక్షులు జి.వేణుగోపాలనాయుడు తెలిపారు. అయితే కాలక్రమంలో వాహనాల రద్దీ పెరగడంతో కాజ్‌వే శిథిలావస్థకు చేరిందన్నారు. ఈ ప్రాంతంలో వంతెన నిర్మిస్తే మక్కువ, సాలూరు మండలాలకు చెందిన 20 గిరిజన గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తీరుతా యన్నారు. పార్వతీపురం ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిధులు మంజూరుకు సిఫారసు చేసి , వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
బాగువలస-మక్కువ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు
బాగువలస-మక్కువ వరకు తారురోడ్డు నిర్మాణానికి రూ.10.8కోట్లతో ప్రతిపాదనలు పంపామని ఎస్‌ఈ కాంతిమతి తెలిపారు. కాంట్రాక్టర్ సగంలో పనులు నిలిపివేసినందున మళ్లీ కొత్తగా రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిధులు మంజూరు కాగానే పూర్తిస్థాయిలో మక్కువ వరకు రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. రూ.కోటీ 50లక్షలతో మక్కువ లో మేలాపువలస కాలనీ నుంచి కన్నంపేట వరకు సుమారు 3 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణాన్ని ఈ నెలాఖరుకు పూర్తిచేస్తామని ఆమె తెలిపారు. ఈ పరిశీలనలో డీఈ జానేశ్వరరావు తదితరులు ఉన్నారు.