ఆర్తనాదాలు చేస్తూ.. ప్రాణాలు వదిలి
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:27 AM
లారీ, టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ మృతిచెందిన సంఘటన మంగళ వారం చోటు చేసుకుంది.
లారీ, టిప్పర్ ఢీకొని డ్రైవర్ మృతి
ముగ్గురికి గాయాలు
దత్తిరాజేరు, సెప్టెంబరు 22(ఆం ధ్రజ్యోతి): లారీ, టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ మృతిచెందిన సంఘటన మంగళ వారం చోటు చేసు కుంది. మానాపురం పోలీసుల వివరాల మేరకు.. విజయనగరం నుంచి బొబ్బిలి వైపు యూరియా లోడుతో ఉన్న వెళ్తున్న లారీ, రామభద్రపురం వైపు నుంచి విజయనగరం వెళుతున్న టిప్పర్.. మండలం లోని కోమటిపల్లి, మరడాం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ కేబిన్‌లో ఇరుక్కుపోయి 2 గంటలపాటు కాపాడా లంటూ ఆర్తనాదాలు వేస్తూ మృతిచెందాడు. టిప్పర్ డ్రైవర్ రవీంద్ర బీహార్‌కు చెందిన వ్యక్తి. టిప్పర్ క్లీనర్‌కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు. ఎదురుగా వస్తున్న లారీలోని డ్రైవర్, క్లీనర్‌లకు గాయాల య్యాయి. వీరిని గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై రెండు వాహనాలు నిలిచిపోవడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపో యింది. దీంతో పోలీసులు స్పందించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.