Share News

బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరం

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:00 AM

బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని ఐసీడీఎస్‌ అధికారులు తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు పుర్కరించుకొని అంగన్‌వాడీ కేంద్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

 బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరం
భోగాపురం: ర్యాలీ నిర్వహిస్తున్న ఐసీడీఎస్‌ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు :

బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని ఐసీడీఎస్‌ అధికారులు తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు పుర్కరించుకొని అంగన్‌వాడీ కేంద్రాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

ఫలక్కవరపుకోట, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): లక్కవరపుకోటలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో తల్లుల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్త రాణి పాల్గొన్నారు.

ఫ మెరకముడిదాం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లీబిడ్డకు అనుబంధంతోపాటు ఆరోగ్యవంతమైన శిశువుగా ఎదుగుతుందని స్త్రీశిశు సంక్షేమశాఖ సూపర్‌వైజర్‌ తాడ్డి శ్రీదేవి తెలిపారు. సోమవారం ఊటపల్లిలో తల్లి పాలవారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌వీ జె.భవాని, అంగన్‌ వాడీ కార్యకర్తలు ఆర్‌.నీలవేణి, జె.పోలమ్మ, ఆశా కార్యకర్త కె.నాగమణి, గర్భిణులు, బాలింతలు, తల్లులు, కిశోర బాలికలు పాల్గొన్నారు.

ఫగజపతినగరం, ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి): తల్లి పాలే బిడ్డకు శ్రీరామరక్షగా నిలు స్తాయని ఐసీడీఎస్‌ పీవో ఎం.రాజేశ్వరి తెలిపారు. గజపతినగరం, గంగచోళ్లపెంట అంగన్‌వాడీకేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌ వైజర్‌ శకుంతల పాల్గొన్నారు.

ఫడెంకాడ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లిపాలు అందిం చాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సుహాసిని తెలిపారు. డెంకాడ సెక్టార్‌లో తల్లిపాల వారోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ రాణి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫభోగాపురం, ఆగస్టు3(ఆంధ్రజ్యోతి): తల్లి పాలే శిశువుకి సంపూర్ణమైన ఆహార మని భోగాపురం ప్రాజెక్టు ఐసీడీఎస్‌ సీడీపీవో లావణ్య తెలిపారు. భోగాపురం సెక్టారుపరిధిలో తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా గర్భిణులు, బాలింతలకు అవగా హన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ కేహెచ్‌వీ సత్యవాణి, అంగన్‌వాడీవర్కర్లు ఆళ్లయశోద, టి.వరం, రమణమ్మ, తులసి, అనురాధ పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 12:00 AM