Relief from Stress పరీక్షల్లో విరామం.. ఒత్తిడి దూరం
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:50 PM
Break During Exams… Relief from Stress పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మరికొందరు చదివిన పాఠాలను మర్చి పోతుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రతి పరీక్షకు మధ్య ఒక రోజు విరామం ఉండేటట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది.
చదువుపై దృష్టిపెడితే సత్ఫలితాలు
సాలూరు రూరల్, మార్చి7(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇదే సమయంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మరికొందరు చదివిన పాఠాలను మర్చి పోతుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రతి పరీక్షకు మధ్య ఒక రోజు విరామం ఉండేటట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గనుంది. ప్రశాంతంగా చదువుకుని పరీక్షలు రాసే వీలు కలుగుతుంది. గతంలో వరుసగా పరీక్షలను నిర్వహించేవారు. 50 మార్కులకు ఉండగా.. హిందీ తప్ప మిగిలిన సబ్జెక్ట్‌లకు రెండేసీ పేపర్లు రాయాల్సి ఉండేది. ప్రస్తుతం సైన్స్‌కు మినహా మిగిలిన సబ్జెక్ట్‌లకు ఒక్కో పేపర్ రాయాల్సి ఉంటుంది. అయితే పరీక్షల మధ్య విరామం వల్ల తదుపరి పరీక్షకు సన్నద్ధం కావడానికి విద్యార్థులకు సమయం దొరుకుతుంది. టెన్త్ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 68 పరీక్ష కేంద్రాల్లో 10,644 మంది , విజయనగరం జిల్లాలో 119 పరీక్ష కేంద్రాల్లో 23,565 వేల మందికి పైబడిన విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఈ నెల 16న తెలుగు, 18న హిందీ, 21న ఇంగ్లీష్ (తొలుత 20న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా రంజాన్ పండుగ నేపథ్యంలో 21కు మార్చారు ), 23న గణితం, 25న ఫిజికల్ సైన్స్, 28న బయాలాజికల్ సైన్స్, 30న సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నారు. 31న ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1, ఏప్రిల్ 1న ఓఎస్‌ఎస్‌సీ పేపర్ 2 ఒకేషనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.