Share News

తోటపల్లి కుడి కాలువకు గండి

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:02 PM

తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని కుడి కాలువకు గండి పడింది. గొట్టివలస, శివ్వాం గ్రామాలకు చెందిన రెండో బ్రాంచ్‌ పరిధిలో ఈ గండి ఏర్పడింది.

తోటపల్లి కుడి కాలువకు గండి
శివ్వాం సమీపంలో కాలువకు గండి పడిన దృశ్యం

- సాగునీటి సరఫరా నిలుపుదల

- ఆందోళనలో రైతులు

గరుగుబిల్లి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని కుడి కాలువకు గండి పడింది. గొట్టివలస, శివ్వాం గ్రామాలకు చెందిన రెండో బ్రాంచ్‌ పరిధిలో ఈ గండి ఏర్పడింది. దీంతో అధికారులు సాగునీటి సరఫరాను నిలుపుదల చేశారు. ప్రధానంగా సుంకి, మరుపెంట, సీమలవానివలస, శివ్వాం, కొత్తూరు, కొత్తపల్లి ప్రాంతాల్లో కాలువ పరిస్థితి దయనీయంగా తయారైంది. మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రతి ఏటా ఖరీఫ్‌ సమయంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో కాలువకు గండి పడటంతో సాగునీటికి ఆటంకం ఏర్పడింది. కాలువ పరిధిలో సుమారు 7 వేల ఎకరాలకు పైగా రైతులు సాగు చేస్తున్నారు. రెండు రోజులుగా సాగునీరు సరఫరా కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఏఈ డీవీ రమణ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.గౌరునాయుడు మాట్లాడుతూ.. గండిని పూడ్చేందుకు యంత్రాలను సిద్ధం చేస్తున్నామన్నారు. శుక్రవారం గండి పూడ్చి శనివారం సాగునీరు విడుదల స్తామని తెలిపారు.

Updated Date - Sep 10 , 2026 | 11:02 PM