Share News

Thotapalli Old Regulator తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలో కుడి కాలువకు గండి

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:50 PM

Breach in the Right Canal under Thotapalli Old Regulator తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధి.. గొట్టివలస-శివ్వాం గ్రామాల మధ్యన ఉన్న కుడి కాలువకు సోమవారం రాత్రి గండి పడింది. దీంతో సాగునీరు వృఽథాగా పోయింది.

  Thotapalli Old Regulator తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలో కుడి కాలువకు గండి
గొట్టివలస - శివ్వాం గ్రామాల మధ్య కుడి కాలువకు పడిన గండి

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధి.. గొట్టివలస-శివ్వాం గ్రామాల మధ్యన ఉన్న కుడి కాలువకు సోమవారం రాత్రి గండి పడింది. దీంతో సాగునీరు వృఽథాగా పోయింది. కొద్ది రోజుల కిందట సుంకి సమీపంలో రెండు ప్రాంతాల్లో గండ్లు పడడంతో సాగునీరు గెడ్డలో చేరింది. తాజాగా కుడి కాలువకు గండి పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే ఖరీఫ్‌ సాగు ఎలా? అని ఆందోళన చెందుతున్నారు. తరచూ సుంకికి ఆనుకుని ఉన్న కాలువ ప్రాంతంలో అధికంగా గండ్లు పడడంతో ఈ ఏడాదీ సాగునీటి ఇక్కట్లు తప్పేలా లేవని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కాగా వీరఘట్టం ఏఈ డీవీ రమణ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌరునాయుడులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి.. యంత్రం సాయంతతో గండిని పూడ్చి వేయించారు. రైతులు సహకారంతో పనులు పూర్తి చేయించారు.

Updated Date - Apr 21 , 2026 | 11:50 PM