Gold Rally పసిడి పరుగుకు బ్రేక్
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:59 PM
Brake on the Gold Rally బంగారం,వెండి ధరలు దిగొస్తున్నాయి. గత నాలుగు రోజులతో పోల్చితే భారీగా తగ్గాయి. ఆదివారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 34,300 మేర, 22 క్యారెట్ల ధర రూ. 25 వేల వరకు తగ్గింది. వెండి కిలో రూ. 1,23,000 వరకూ తగ్గింది. ఈ ధరలు మరింత తగ్గుతాయా? మళ్లీ పెరుగుతాయా అనే మీమాంసలో వ్యాపారులు, కొనుగోలుదారులు ఉన్నారు.
నాలుగు రోజుల్లో భారీగా తగ్గిన ధరలు
సాలూరు రూరల్, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): బంగారం,వెండి ధరలు దిగొస్తున్నాయి. గత నాలుగు రోజులతో పోల్చితే భారీగా తగ్గాయి. ఆదివారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 34,300 మేర, 22 క్యారెట్ల ధర రూ. 25 వేల వరకు తగ్గింది. వెండి కిలో రూ. 1,23,000 వరకూ తగ్గింది. ఈ ధరలు మరింత తగ్గుతాయా? మళ్లీ పెరుగుతాయా అనే మీమాంసలో వ్యాపారులు, కొనుగోలుదారులు ఉన్నారు. గతేడాది డిసెంబరు నుంచి నిన్నమొన్నటి వరకు పసిడి, వెండి ధరలు పరుగులు పెట్టాయి. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. శుభ ముహుర్తాలు వస్తుండడంతో బంగారం ఎలా కొనుగోలు చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. అయితే తాజాగా వాటి ధరలు తగ్గుముఖం పడుతుండడం విశేషం. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆదివారం రూ.1,54,000లుగా ( తులం ధర రూ. 1,79,664 ), 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 1,41,500 ( తులం ధర రూ. 1,64,950 )గా ఉంది. కిలో వెండి రూ. 2,88,000లుగా ఉంది. వాటి ధరలు మరింత తగ్గుతాయనే ఆశాభావంతో కొనుగోలుదారులున్నారు. కాగా బంగారం వెండి, ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో కచ్చితంగా చెప్పలేమని వర్తకసంఘం సాలూరు అధ్యక్షుడు సుతాపల్లి వీరవెంకటరావు తెలిపారు.