Share News

Thotapalli 21 నుంచి తోటపల్లిలో బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:14 AM

Brahmotsavams at Thotapalli from the 21st ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల్లో ఈ నెల 21 నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు.

  Thotapalli  21 నుంచి తోటపల్లిలో బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న తోటపల్లి దేవస్థానం

గరుగుబిల్లి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి దేవస్థానాల్లో ఈ నెల 21 నుంచి 24 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో వీవీ సూర్యనారాయణ తెలిపారు. శనివారం స్థానిక విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ.. బుధవారం నుంచి ఆలయంలో విష్వక్షేణ ఆరాధన పుణ్యహ వాచనం, ఉత్సవాంగీకారం, రుత్విక్‌ వరుణ, అంకురారోహణ, కల్యాణ మండల పూజ నిర్వహిస్తామన్నారు. 24న ప్రత్యేక పూజలు అనంతరం నాగావళి నదీ తీరంలో ఉత్సవమూర్తులకు చక్రతీర్థ స్నానాలు జరుపుతామని తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 12:14 AM