కొవ్వాడ తీరానికి చేరిన బాలుడి మృతదేహం
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:19 AM
పూసపాటిరేగ మండలం కొత్తూరు గ్రామాని కి చెందిన కొమర లక్ష్మణ(12) మృతదేహం ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ తీరానికి చేరింది.
రణస్థలం, మే 31 (ఆంధ్రజ్యోతి): పూసపాటిరేగ మండలం కొత్తూరు గ్రామాని కి చెందిన కొమర లక్ష్మణ(12) మృతదేహం ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ తీరానికి చేరింది. జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మేనమామ బర్రి అమ్మోరుతో కలిసి శనివారం చింతపల్లి సుమద్ర స్నానానికి లక్ష్మణ, ఆయన చెల్లి వెళ్లారు. సముద్రపు కెరటాలకు కొట్టుకు పోతున్న లక్ష్మణను కాపాడేందుకు బర్రి అమ్మోరు ప్రయత్నించాడు. ఈ నేపథ్యం లో లక్ష్మణతో పాటు అమ్మోరు సముద్రంలో గల్లంతయ్యారు. లక్ష్మణ మృతదేహం కొవ్వాడ తీరానికి ఆదివారం చేరుకుది. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ చిరంజీవి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.