బొత్స వాస్తవాలు గ్రహించాలి
ABN , Publish Date - Apr 02 , 2026 | 12:16 AM
అవాకులు చవాకులు మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స అండ్ పార్టీ ఇకనైనా, వాస్తవాలు గ్రహించాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు హితవుపలికారు.
చీపురుపల్లి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): అవాకులు చవాకులు మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స అండ్ పార్టీ ఇకనైనా, వాస్తవాలు గ్రహించాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు హితవుపలికారు. రాష్ట్రంలో జరుగు తున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి, ఓర్వలేక వైసీపీ నాయకులు గుండెలు బాదుకుంటున్నారని పేర్కొనారు. అమరావతి రాజధానికి చట్ట భద్రత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. బుధవారం చీపురుపల్లిలో కళా వెంకటరావు విలేకరులతో మాట్లాడారు. మూలపేట పోర్టు పనులు గత ప్రభుత్వం హయాంలో కేవలం 30 శాతం మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. అనకాపల్లిలో స్టీల్‌ప్లాంట్, భోగాపురం ఎయిర్ పోర్టు, విశాఖపట్నంలో 90వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వల్ల లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు.