‘బొటానిక్స్’ ఉత్తరాంధ్ర రైతులకు వరం
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:20 AM
పసుపు, కాఫీ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేయడానికి దోహదపడేలా బొటానిక్స్ పరిశ్రమను ప్రారంభించడం ఉత్తరాంధ్ర రైతులకు వరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నా రు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
భోగాపురం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): పసుపు, కాఫీ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేయడానికి దోహదపడేలా బొటానిక్స్ పరిశ్రమను ప్రారంభించడం ఉత్తరాంధ్ర రైతులకు వరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నా రు. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో యువశ్రామికవేత్తలు సురేష్, మధు నెలకొల్పిన బొటానిక్ప్ పరిశ్రమను గురవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో అనేక పరిశ్రమలు వచ్చాయన్నారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా దేశవిదేశాలకు ఉత్తరాంధ్ర వ్య వసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునే అవకావం ఉందన్నారు. బొటానిక్స్ కంపెనీ ద్వారా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా 1100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తా యన్నారు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ఉత్త రాంధ్రలో పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు.
ఎమ్మెల్యే లోకం నాగమాఽధవి మాట్లాడుతూ స్థానిక రైతులు పండించే పసుపు, అల్లం, కొబ్బరి, మామిడి వంటి పంటలను అమెరికా తదితర దేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ కంపెనీ తోడ్పడుతుందన్నారు.
మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కమీషన్లకు కక్కుర్తి పడి కంపెనీలు రాకుండా చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తు న్నామని అన్నారు. బొటానిక్స్ సీఈవో ఎస్‌వీఎన్ సురేష్‌బాబు, మేనేజింగ్ డైరెక్టర్ మఽధు తదితరులు పాల్గొన్నారు.