గరుగుబిల్లి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:24 AM
విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల శాఖా గ్రంథాలయ నిర్వాహకుడు నల్ల మధుసూదనరావు సూచించారు.
గరుగుబిల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మండల శాఖా గ్రంథాలయ నిర్వాహకుడు నల్ల మధుసూదనరావు సూచించారు. ఆదివారం 59వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గరుగుబిల్లి శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు పుస్తక ప్రదర్శన, క్విజ్ పోటీలు, క్రీడల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కె.స్వామినా యుడు పలు అంశాలపై అవగాహన కల్పించారు.