Share News

నాగావళిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం

ABN , Publish Date - Oct 19 , 2026 | 12:14 AM

మండ లంలోని కొమిరి, బూర్జ మండలం కిలంతర గ్రామాల సరిహద్దు ప్రాంతం నాగావళి నదీ తీరంలో ఆదివారం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసు లకు సమాచారం ఇచ్చారు.

నాగావళిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం

రేగిడి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): మండ లంలోని కొమిరి, బూర్జ మండలం కిలంతర గ్రామాల సరిహద్దు ప్రాంతం నాగావళి నదీ తీరంలో ఆదివారం గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, పోలీసు లకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరి శీలించి, ఒడ్డుకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపా రు. ఇటీవల నాగావళి భారీ వరదలకు కొట్టుకువచ్చిందా, నదిలో స్నానానికి దిగి ప్ర మాదవ శాత్తు మృతిచెందిందా అన్నది విచా రణలో తేలాల్సి ఉంది. దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని ఎస్‌ఐ తెలిపారు. అయితే మృతదేహం ఉన్నచోటు ఏ గ్రామం సరిహద్దు అన్నది స్పష్టత రాలేదు.

Updated Date - Oct 19 , 2026 | 12:14 AM