అంధుల క్రికెట్ టోర్నీ విజేత బొబ్బిలి టైగర్స్
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:11 AM
రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నీ చాంపియన్‌షి్‌పను విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి టైగర్ జట్టు కైవసం చేసుకుంది.
తిరుపతి అర్బన్, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నీ చాంపియన్‌షి్‌పను విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి టైగర్ జట్టు కైవసం చేసుకుంది. తిరుపతిలోని గొల్లవానిగుంట క్రికెట్ మైదానంలో నాలుగు రోజుల పాటు రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. లీగ్, సెమీఫైనల్స్ మ్యాచ్‌లు నువ్వా.. నేనా అన్నట్లు హోరాహోరీగా జరిగాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఫైనల్స్‌లో బొబ్బిలి టైగర్స్, వైజాగ్ చాలంజర్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన వైజాగ్ చాలంజర్స్ నిర్ణీత 15 ఓవర్లకు 153 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన బొబ్బిలి టైగర్స్ 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఈ జట్టు బ్యాట్స్‌మెన్ ఎ.రవి 37బంతుల్లో 74 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. టోర్నమెంట్ ఆద్యంతం అత్యుత్తమ ప్రతిభచాటిన డి.వెంకటే్‌ష(బ్యాటర్, వైజాగ్ కింగ్‌డమ్), ఎ.లోకేశ్(ఆల్‌రౌండర్, గట్ల క్రికెట్‌క్లబ్), డి.తాండవ కృష్ణ(బ్యాటర్, వైజాగ్ చాలంజర్స్) ప్లేయర్స్ ఆఫ్ ది సీరి్‌సగా ఎంపికయ్యారు. ముగింపు సంబరాలకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మ ణ్యం, బిగ్‌బాస్ ఫేమ్ కల్యాణ్, అర్జున అవార్డు గ్రహీత, భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుత కెప్టెన్ దుర్గారావు పాల్గొని విన్నర్స్, రన్నర్స్‌కు ట్రోఫీలు, బహుమతులు ప్రదానం చేశారు. బొబ్బిలి టైగర్ జట్టుకు విన్నర్స్ ట్రోఫీతో పాటు రూ.30వేలు, రన్నర్‌పగా నిలిచిన వైజాగ్ చాలంజర్స్ జట్టుకు రూ.25వేలు బహుమతి అందజేశారు.