తైక్వాండోలో బొబ్బిలి విద్యార్థుల సత్తా
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:58 PM
విజయనగరంలో తైక్వాండో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 19వ జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో బొబ్బిలి విద్యార్థులు సత్తా చాటారు.
బొబ్బిలి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): విజయనగరంలో తైక్వాండో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 19వ జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో బొబ్బిలి విద్యార్థులు సత్తా చాటారు. సబ్ జూనియర్, క్యాడెట్, సీనియర్ విభాగంలో నాలుగు బంగారు పతకాలు, ఆరు రజత, 12 కాంస్య పతకాలను సాధించారని కోచ్ బంకురు ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను తైక్వాండో క్లబ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బేబీనాయన, ఇతర క్రీడాభిమానులు అభినందించారు.