బొబ్బిలి ఐటీఐకి కేంద్రం ప్రత్యేక గుర్తింపు
ABN , Publish Date - Jun 02 , 2026 | 12:23 AM
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సేతు పఽథకానికి బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ ఎంపికైంది.
బొబ్బిలి, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సేతు పఽథకానికి బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐ ఎంపికైంది. దీంతో ఇక్కడ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందించేందుకు మార్గం సుగమమైంది. దేశంలో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన యువతను తయారుచేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఐటీఐల ఆభివృద్దికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందు లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని 83 ప్రభుత్వ ఐటీఐలను పీఎం సేతు పఽథకానికి ఎంపిక చేయగా అందులో బొబ్బిలికి చోటు దక్కింది. ఈ పథకం ద్వారా ఐటీఐలో నూతన భవనాల నిర్మాణం, ఆధునిక ల్యాబ్‌లు, సాంకేతిక పరికరాలు, మెరుగైన వసతులు ఏర్పాటుకానున్నాయి. అలాగే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త ట్రేడ్లు, కోర్సులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అత్యధునిక సాంకేతిక శిక్షణ పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. స్థానిక ఐటీఐని పీఎం సేతు పఽథకంలో చేర్చినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.