కళాప్రదర్శనలకు బొబ్బిలి కళాకారులు
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:58 AM
స్థానిక ఆనందో బ్రహ్మ అకాడమీలో ఉచిత శిక్షణ చెందిన పలువురు కోలాటం కళాకారులు రాష్ట్రవ్యాప్యంగా జరగనున్న పలు ఉత్సవాలలో ప్రదర్శనలు ఇవ్వనున్నారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మింది విజయమోహనరావు తెలిపారు.
బొబ్బిలి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆనందో బ్రహ్మ అకాడమీలో ఉచిత శిక్షణ చెందిన పలువురు కోలాటం కళాకారులు రాష్ట్రవ్యాప్యంగా జరగనున్న పలు ఉత్సవాలలో ప్రదర్శనలు ఇవ్వనున్నారని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మింది విజయమోహనరావు తెలిపారు. స్థానిక కోటలో గురువారం కోలాటం కళాకారులను అభినందిస్తూ ప్రదర్శనలకు సాగనంపారు. శుక్రవారం విశాఖపట్నంలో, ఈ నెల మూడో వారంలో శ్రీకాళహస్తిలో, సీతంపేటలో జరిగే గిరిజన ఉత్సవాలు, విజయవాడలో కనకదుర్గమ్మ, విజయనగరం పైడితల్లమ్మ ఉత్సవాలలో ప్రదర్శనలు ఇవ్వనున్నారన్నారు.